
మనఛానల్ న్యూస్ – గుర్రంకొండ
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పరిధిలోని గుర్రంకొండ మండలం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు పీలేరు ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి కార్యలయం సోమవారం తెలిపింది. మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలు , పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల స్థాయి నాయకులు పాల్గోనాలని కోరారు. ముఖ్యంగా సచివాలయాల పరిధిలో పార్టీ సమన్యకర్తల నియామకం, 2024 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరేలా చేయడం, పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డిని తిరిగి గెలిపించి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గుర్రంకొండ పట్టణం గోల్డెన్ ప్లాజా కళ్యాణ మండపం నందు జరిగే కార్యకర్తల సమావేశం లో పీలేరు ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గోననున్నారు.
శెట్టివారిపల్లిలో పంచాయతీలో మంగళవారం గడపగడప కార్యక్రమం
మంగళవారం ఉదయం గుర్రంకొండలో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం ఎం.ఎల్.ఏ చింతల “గడప గడపకు మన ప్రభుత్వము” కార్యక్రమంలో మధ్యహ్నం. 2.00 గుర్రంకొండ మండలం శెట్టివారి పల్లి సచివాలయం నందు క్రింద గ్రామాల్లో పాల్గొంటారని ఎం.ఎల్.ఏ కార్యకలయం తెలిపింది. రేగడ పల్లి, యం.కొత్త పల్లి, తూగువారి పల్లి, బోడిగుట్ట హరిజన వాడ, బోడిగుట్ట లలో కార్యక్రమం జరుగుతుందని మండలంలోని మండల స్థాయి అధికారులు, సదరు గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్లు, YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గోనాలని కోరారు.