33మంది మిట్స్ విద్యార్థులకు ఎన్.సి.సి – సి సర్టిఫికెట్

0
312

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లిలోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీలో ఇంజనేరింగ్ విద్యాభ్యాసం చేస్తున్న33 మంది విద్యార్థులు ఎన్.సి.సి.- సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ పోందారని కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్
 సి. యువరాజ్  ఓ ప్రకటనల్ తెలిపారు. N.C.C-C సర్టిఫికెట్ కోసం పోటి పడిన 33మంది విద్యార్థులలో 15 మంది ఏ గ్రేడ్ తోను, మరో 18 బి గ్రేడ్ తో “సి” సర్టిఫికెట్ లలో ఉతీర్ణులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఇందు కోసం కృషి చేసిన మిట్స్ కళశాల ఎన్.సి.సి విబాగం అధిపతులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు. వీరికి చిత్తూర్ 35వ ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ రంగనాథన్ సర్టిఫికెట్స్ ను అందజేశారన్నారు. ప్రతిభ కనపరిచిన క్యాడెట్స్ ను కళాశాల కరెస్పాండెట్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, యన్.సి.సి లెఫ్ట్ నెంట్ డాక్టర్ యన్.నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ రంగనాథన్, సుభేదర్ మేజర్ బఫ్నేట్ మరియు తదితరులు అభినందించారు.