
మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలలో చట్టసభలలో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశ పెట్టాలని కోరుతూ జాతీయ బిసి సంఘం ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్లోన్న జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7దశాబ్ధాలు దాటుతున్న దేశంలో బడుగు,బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటులోనే ఉన్నారని, రాజ్యంగ పదవులు నేటికి బి.సిలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని, జనాభా ప్రాతిపదికన చట్టసభలలో 50శాతం పదవులు వెనుకబడిన వారికి కల్పిస్తే భవిష్యత్ లో వారు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారని అన్నారు. ఏపిలో వై.ఎస్.జగన్ ప్రభుత్వం బిసిలకు రాజకీయ పదవులు కట్టడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్.కృష్ణయ్య అన్నారు.
31 మంది పార్లమెంటు సభ్యులున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బిసిలకు చట్ట సభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం ముందుండి పోరాడుతుందని, A.P.ముఖ్యమంత్రి , వైకాపా అధ్యక్షుడు Y.S. జగన్ బిసిల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రశంసించారు. సి.పి.ఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతుా బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ బిసి సంఘం దక్షణ భారతదేశం విభాగం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, గుజ్జా కృష్ణ , భూప సాగర్, హరీష్, లాల్ కృష్ణ, రామకృష్ణ, రాజశేఖర్, రాజగోపాల్ తో పాటు పలువురుబిసి నేతలు పాల్గోన్నారు.