Rayachoti : రోడ్డు ప్రమాదంలో గ్రామ వాలంటీర్ మృతి – తక్షణం స్పందించిన రాయచోటి ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి

0
418

మనఛానల్ న్యూస్ – రాయచోటి
ఓ గ్రామ వాలంటీర్ ఇంజనేరింగ్ చదువుతున్న తన భార్యను కాలేజీలో వదిలేందుకు బైక్ పై వెళ్లుతుండుగ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో సోమవారం జరిగింది. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లె కొత్తపల్లె కు చెందిన గ్రామ వాలంటీర్ సూరం శివారెడ్డి రాయచోటి లోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన సతీమణి హర్షితను కళాశాలలో వదిలి పెట్టేందుకు సోమవారం ఉదయం బైక్ పై వెళ్లుతుండగ రామాపురం మండలం టోల్ గెట్ సమీపంలోని చింతల వాండ్లపల్లె వద్ద జాతీయరహదారి పై బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో బైక్ నడుపుతున్న శివారెడ్డికి తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందగా, అతని భార్య తీవ్ర గాయాలతో భయటపడి రక్షించమని రోడ్డుపై వెళ్లుతున్న వాహనదారులను అర్థించగా ఏవరూ పట్టించుకోలేదు. ఈ సమయంలో రామపురం నుంచి రాయచోటి వైపు వస్తున్న ఏం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి తన వాహనశ్రేణులను ఆపి సంఘటనను పరిశీలించి 108 వాహనం కోసం మరియు పోలీసులకు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన హర్షితను స్వయంగా తన వాహనంలోనే రాయచోటి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి త్వరితగతిన వైద్యం అందేలా చేశారు. మృతి చెందిన శివారెడ్డికి పోస్టు మార్టం నిర్వహించి సాయంకాలం బంధువులకు అప్పగించారు.
శభాష్ ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డిగారు
ప్రమాదం సమయంలో సహాయాన్ని అర్థిస్తున్న క్షతగాత్రుల పట్ల రాయచోటి ఎం.ఏల్.ఏ శ్రీకాంత్ రెడ్డి చూపిన మానవత్వానికి స్థానికులు హ్యాట్సఫ్ తెలిపారు. ఎం.ఎల్.ఏ స్వయంగా క్షతగాత్రురాలిని వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, పోలీసులకు సత్వర సమాచారం అందించడం, రాయచోటి ఆసుపత్రిలో గాయపడ్డ క్షతగాత్రురాలికి మంచి వైద్యం అందేలా వైద్యులకు ఆదేశించడం, మరణించిన వాలంటరీ కుటుంబానికి ధైర్యాన్ని అందించడం పట్ల స్థానికులు, బాధితుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.