మదనపల్లిలో అక్రమ వాహనాల వేలం

0
242

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మద్యం అక్రమంగా రవాణా చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన వాహనాలను మదనపల్లి డి.ఎస్.పి కేశప్ప ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. 3 ద్విచక్ర, ఒక ఆటో ను వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,48,800లు ఆదాయం లభించింది. దీనిని ప్రభుత్వ ఖజానాకు జమచేస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి కేశప్ప తెలిపారు. మదనపల్లి టూటౌన్ సి.ఐ మురళీకృష్ణ వేలం పాటలో పాల్గోన్నారు.