
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గల కె.ఎన్.ఆర్. ఫంక్షన్ హాలులో డిసెంబర్ 27వ తేది నిర్వహిస్తోన్న కురబ కులస్తుల ఆత్మీయ సమావేశం చలో కురబలకోట కార్యక్రమానికి కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి కురబ నేత హెచ్. ఎమ్. రేవణ్ణ ను ఏపి కురబసంఘం నేతలు సోమవారం బెంగళూర్ లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కురబ కులస్తుల ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు 535 జయంతి వేడుకలు, ఏపి కురబ సంఘం,షేపార్డ్ ఇండియా ఏపి విభాగం ఏడవ వార్షికోత్సవ సంబరాలలో అతిథిగా పాల్గోనాల్సినదిగా
కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి హెచ్. ఎమ్. రేవణ్ణ ను ఏపి కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు నేతృత్వంలో కురబ సంఘం నేతలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక షేఫెర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులు హరీష్, నాగరాజ్, జిద్దమని, ఐటిఐ నాగరాజ్ తదితరులు పాల్గోన్నారు.