హలో కురబలు …డిసెంబర్27న చలో కురబలకోట విజయవంతం చేయండి – కురబ సంఘం నేత జబ్బల శ్రీనివాసులు పిలుపు

0
250

కురబ సంఘం సమావేశంలో మాట్లాడుతున్న ఏపి కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు

మనఛానల్ న్యూస్ – మదనపల్లి

కురబ కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోగతి సాధించడానికి, కురబలలో ఐక్యత చాటేందుకు డిసెంబర్27న అన్నమయ్య జిల్లా కురబల కోట వద్ద కురబల దైవం శ్రీ భక్త కనకదాసు 535 వ జయంతి ముగింపు వేడుకలు, ఏపి కురబ సంఘం, ఏపి షెఫార్డ్ ఇంటర్నేషనల్ 7వ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈకార్యక్రమానికి రాష్ట్రంలోని కురబ కుల బంధువులు అధికంగా హాజరై విజయవంతం చేయాలని ఏపి కురబసంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కురబ సంఘం కార్యాలయం సంఘం కార్యవర్గం మరియు కురబ కుల పెద్దలతో ఈ నెల 27న జరిగే కనక దాసు జయంతి ఉత్సవాల నిర్వహణపై సన్నాహ సమావేశం జరిపి, ఉత్సహాలను విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కురబ కులసంఘం నేతలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా కురబ సంఘం సమావేశంలో ఏపి కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి-కదిరి రోడ్డు లో అంగళ్లు సమీపంలోని చేనేత నగర్ వద్ద ఈనెల 27వ తేది మంగళవారం కె.ఎన్.ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించే కనక దాసు జయంతి, ఏపి కురబ సంఘం మరియు
ఏపి షెపార్డ్ ఇండియా ఇంటర్నేషనల్ 7వార్షికోత్సవాలకు కురబ కుల బంధువులు అధికంగా పాల్గోనాలని కోరారు.ఈ ఉత్సవాలకు ప్రతి కురబ బంధువును సాదరంగా స్వాగతం పలుకుతున్నామని అన్నారు. కురబ సంఘం నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకోవాలని అన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కురబ ప్రజాప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గోంటారని తెలిపారు.

అలాగే, ఉత్సవాలకు విచ్చేసే ప్రతినిధులు, ప్రజలకు అన్నిరకాల వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కురబల ఐక్యతను చాటాలాని, కురబల ఔనత్యాన్ని భావి తరాలు గుర్తించేలా చూడాలన్నారు. కురబలు సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ కార్యక్రమాలు దోహదపడుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపి కురబ సంఘం మరియు ఏపి షెఫార్డ్ ఇండియా ఇంటర్నేషనల్ రాష్ట్రాధ్యక్షులు జబ్బల శ్రీనివాసులుతో పాటు సంఘం రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, రెడ్డన్న,మురళీ, కురబ కార్పోరేషన్ డైరక్టర్ నరసింహాలు, కడప జిల్లా కురబ సంఘం అధ్యక్షులు రవిశంకర్, వాల్మీకిపురం జెడ్.పి.టి.సి. ఆనంద్ రాయుడు కురబ సంఘం నాయకులు జనార్ధన్, లక్ష్మన్న, దినకర్, మధు, ఆర్.కె.శ్రీనివాసులు, లక్ష్మీదేవి, గంగాధర్, రమేష్, కాంట్రాక్టర్ డి.వి రమణ పలువురు కురబ కుల పెద్దలు పాల్గోన్నారు.

సమావేశానికి హాజరైన కురబ సంఘం ప్రతినిధులు