
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ నవంబర్ 30వతేదీన మదనపల్లి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లును అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్, పోలీసు సూపరిండింట్ హర్షవర్ధనరాజు మదనపల్లిలో మకాం వేసి పరిశీలిస్తున్నారు. మదనపల్లి ఎం.ఎల్.ఏ నవాజ్ బాష సైతం ఏర్పాట్లును ప్రత్యేకంగా పరిశీలిస్తూ అధికారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం.పి. మిధున్ రెడ్డి ఆదివారం సభా స్థలి ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సి.ఎం.జగన్ జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగువ విడత నిధులను విడుదల చేయనున్నారు.
కలెక్టర్ సమీక్ష

నెల 30వ తేదీన ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత విద్యాదీవెన పథకాన్ని మదనపల్లి పట్టణoలో ప్రారంభిస్తున్న తరుణంలోఈరోజు ఉదయం మదనపల్లి పట్టణ ఆర్డీవో కార్యాలయం నందు జరిగిన సమావేశంలో అటవీ, విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు నారాయణస్వామి గారు, పార్లమెంటు సభ్యులు యువనేత పీవీ మిథున్ రెడ్డి గారు,రెడ్డప్ప గారు, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు, రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి గారు, మదనపల్లి శాసనసభ్యులు నవాబ్ భాషా గారు, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం గారు, ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారులు ఆలూరి సాంబశివరెడ్డి గారు,కలెక్టర్ గిరీష గారు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుగారు, జాయింట్ కలెక్టర్ తమి అన్సరియా,ఆర్డిఓ మురళిగారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CM YS JAGAN Madanapalle Programme Schedule

