ఈ రోజు ముఖ్యాంశాలు- TODAY Top News @ manachannel.in

0
209

మనఛానల్ న్యూస్ – News Desk

  • దేశ వ్యాప్తంగా వినాయక చవతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
  • వినాయక చవితి పండుగను పురష్కరించుకొని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖర్, ప్రధాని నరేంద్రమోది లు శుభాకాంక్షలు తెలిపారు. ఏపిలో సి.ఎం.వై.ఎస్.జగన్, తెలంగాణాలో సి.ఎం.కె.సి.ఆర్ లు వేర్వేరుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
  • -తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో బుధవారం నుంచి భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలను మూసివేశారు.
  • తెలంగాణ సి.ఎం.కె.సి.ఆర్ గురువారం బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన బీహార్ సి.ఎం. నితిష్ కుమార్ తో సమావేశం కానున్నారు. దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో తీసుకురావాల్సిన చర్యలు గురించి చర్చించనున్నారు.
  • ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా లో ఇండియాకు చెందిన గౌతమ్ అదాని మూడవ స్థానంలో నిలిచారు. ఆసియా లో అతిపెద్ద ధనవంతుగా నమోదు అయ్యారు. ప్రథమ, ద్వితీయ స్థానాలలో అలెన్ మస్క్ (టెస్లా), జెఫ్ బిజోస్ (అమెజాన్)లు ఉన్నారు.ముఖేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు.
  • 67th Wolf777news Filmfare Awards 2022 అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటుడు అవార్డును రణవీర్ సింగ్ (83)ఉత్తమ నటిగా క్రిటి సనాన్, ఉత్తమ చిత్రంగా షేర్షా ఎంపిక చేశారు. అవార్డుల వివరాలకోసం క్లిక్ చేయండి. https://www.filmfare.com/features/winners-of-the-wolf777news-filmfare-awards-2022_-55337.html
  • సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ మంగళవారం సాయంకాలం కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఈయన 1985-91 మధ్య అధ్యక్షులుగా పనిచేశారు.
  • దేశంలో బుధవారం ఉదయానికి 7231 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 45 మంది మరణించారు. రికవరీ రేటు 98.67గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 గా ఉంది.