ఏపి కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం.

0
138

. మనఛానల్ న్యూస్ – అమరావతి
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఏపి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రి వర్గం ఆమోదించిన అంశాలివే..

  • ఈ విద్యాసంవత్సరంలో ఇవ్వనున్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపారు. ఈనెల 27 న తల్లుల ఖాతాలో 13వేలు జమచేస్తారు.
    సుమారు 43 లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు జమచేస్తారు.
  • వివాదస్పమైన కోనసీమ జిల్లా పేరు మార్పుకు సవరణలను కేబినెట్ ఆమోదించింది. ఇక నుంచి కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారు.
  • రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం
  • ఏపిలో ఈ ఏడాదిలో ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోదం
  • వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • ఏపిలో ఏర్పాటు అవుతున్న వివిధ కొత్త ఏర్పాటు అవుతున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో 3,530 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం.
  • రాష్ట్రంలో 15 వేల కోట్ల తో ఏర్పాటు అవుతున్న ఆదాని గ్రీన్ ఎనర్జి ప్రాజెక్ట్ కు మంత్రి వర్గం ఆమోదం
  • ఏపిలో అన్యాక్రంతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం
  • వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరుకు ఆమోదం
  • అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం
  • జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్‌ ఆమోదం​
  • ఏపిలో ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్నవారికి సైతం వర్తింపు
  • పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ల కొనసాగింపునకు ఆమోదం
  • సత్యసాయి జిల్లాలో 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు