Today Top News : ఈ రోజు టాప్ న్యూస్ @ manachannel.in

0
175

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  1. ఆప్ఘనిస్తాన్ బుధవారం ఉదయం సంభవించిన భూకంపంలో 1000 మంది ప్రజలు మరణించారు.1800 మంది గాయపడ్డారు.
  2. మహారాష్ట్రలో శివసేన పార్టీలో సంభవించిన సంక్షోభం తారా స్థాయికి చేరింది.. తమకు 46 మంది ఎం.ఎల్.ఏల మద్దతు ఉందని తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే ప్రకటించారు. తమకు బిజెపి నుంచి ఏలాంటి ప్రలోభాలు రాలేదని తెలిపారు. దీంతో కాంగ్రెస్,శివసేన, ఎన్.సి.పి నేతృత్వంలోని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం సమస్యలలో పడింది.
  3. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ రోమ్ లో పర్యటించారు. ఈసందర్బంగా పోప్ ప్రాన్సిస్ ను వాటికన్ సిటిలో కలుసుకొన్నారు.
  4. వివిధ స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధుల కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు (ఎఫ్.సి.ఆర్.ఏ) గడువును కేంద్ర హోం శాఖ జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30,2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
  5. భారత రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా జూన్ 27వ తేదిన నామనేషన్ దాాఖలు చేయనున్నారు.
  6. ఏపిలో అమ్మఒడి పథకం కింద పిల్లల తల్లుల ఖాతాలో నగదు చేసే కార్యక్రమం జూన్ 27న ఏపి సి.ఎం.వై.ఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రూ.13వేలు చోప్పున రూ.6500 కోట్ల నగదు తల్లుల ఖాతాలో జమచేయనున్నారు.
  7. ఏపిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 54శాతం మంది, సెకండ్ ఇయర్ లో 61 శాతం మంది పాస్ అయ్యారు.
  8. శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాలా తీసిందని ఆదేశ ప్రధాని విక్రమ సింఘే బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోలేని పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు.
  9. మహారాష్ట్రలో నెలకొని ఉన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కీలక ప్రకటన చేశారు. తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ శాసనసభ్యులు కోరితే తక్షణమే తప్పుకొంటానని అన్నారు.
  10. అధికార పార్టీ బిజెపి ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్ కమాండోల ‘జెడ్ ప్లస్’ భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్ర అధికారులు బుధవారం వెల్లడించారు.
  11. రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. జూన్‌ 28 నుంచి రైతుల ఖాతాల్లో వానాకాలం పంట పెట్టుబడి జమ చేయాలని సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.