అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా యువత ఆగ్రహా జ్వాలలు

0
175

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
భారత రక్షణ దళాలలోకి యువత ను ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువతలో నిరసన వ్యక్తం అవుతోంది.ఈ నేపథ్యంలో పలు చోట్ల నిరసనలలో హింస చెలగరేగుతోంది. దీంతో కేంద్రం ఈ పథకం కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలో ఈ పథకంలో వయో పరిమితులను సడలించారు. ప్రస్తుతం ఇచ్చిన 17.5 – 21 సంవత్సరాలలోపు నుంచి 23 సంవత్సరాలలోపు వారికి కూడ ఈ పథకం కింద అర్హత ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి సైనిక నియామకాలలో పాత విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్ తో యువత
దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా బీహార్ లో రైళ్లకు నిప్పు అంటించారు. సికింద్రబాద్ లోసైతం యువకులు రైల్వే స్టేషన్ లోకి చొరబడి రైళు పట్టాలపై నిరసన తెలిపారు. బిజెపి ప్రభుత్వానికి అగ్నిపథ్ తీవ్ర తలనోప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

https://twitter.com/ANINewsUP/status/1537636923946471425/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537636923946471425%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Findia%2Fagnipath-scheme-live-protests-continue-in-several-states-opposition-seeks-withdrawal-of-scheme%2Fliveblog%2F92256192.cms

Agneepath Scheme : 'अग्निपथ'वरून बिहारमध्ये आंदोलन पेटले; विद्यार्थ्यांकडून  सलग दुसऱ्या दिवशी रस्त्यावर उतरत जाळपोळ, रेल्वेही अडवली | Students'  agitation in ...