దేశంలో మళ్లీ కరోనా పంజా – ఒకే రోజు 40శాతం కేసులు పెరుగుదల – నేడు 12213 నమోదు

0
149

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభమైంది. గురువారం ఉదయానికి దేశంలో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 12213. దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా 40శాతం కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వర్గాలు అప్రమత్తయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు ముఖ్యంగా మెట్రో నగరాలలోనే అధికంగా ఉన్నాయి. 11మంది కోవిడ్ కారణంగా మరణించారు. కోవిడ్ పాజిటివ్ రేటు 2.35శాతంగా ఉంది. రికవరీ అయిన కేసుల సంఖ్య 7624 గా ఉన్నాయి. నేటి వరకు దేశ వ్యాప్తంగా 85.63 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.