ఏపికి వర్షసూచన

0
352

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ఏపిలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాల వల్ల వ్యవసాయరంగానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం రాయలసీమలోకి ప్రవేశించి నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కారణంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.