ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయండి – STU గౌరవాధ్యక్షులు బొమ్మిశెట్టి చలపతి వినతి

0
260

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఏపి ప్రభుత్వం రాష్టంలో పదవతరగతి ఫలితాలు ప్రకటన తర్వాత నైన ఉపాధ్యాయులను బోధనేతర పనులను తప్పంచి బోధనకే పరిమితం చేసి విద్యాప్రమాణాలను పెంచాలని STU మదనపల్లి మండల శాఖ గౌరవఅధ్యక్షులు బొమ్మిశెట్టి చలపతి ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయులను వివిధ రకాల ఇతర పనుల కోసం విలువైన సమయాన్ని వృధా చేయడం ద్వారా విద్యాబోధన కుంటుపడుపడి, బోధన చేయలేక విద్యా ప్రమాణాలు తగ్గి పరీక్షలలో విద్యార్థులు ప్రతిభ కనపర్చలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన కంటే అధికంగా పలు యాప్ ల ద్వారా మరుగుదొడ్ల ఫోటోలు, మద్యాహ్నా బోజన పథకంఫోటోలు అఫ్ లోడ్ , అమ్మఒడి లాంటి బోధనేతర పనుల అప్పగించడం మాని బోధనకే పరిమితం చేస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరి విద్యాప్రమాణాలు మెరుగు అవుతాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే అసంబద్ధ,లోపభూయిష్టమైన రేషనలైజేషన్ విధానంతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వు నెం.117 ను సవరించి ప్రాథమిక పాఠశాలలో 1ః30కి బదులు 1ః20కి, హైస్కూలు లో 1ః60 స్థానంలో 1ః40కి కుదించడం, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇరువురు ఉపాధ్యాయులను నియమించాలని, ప్రతి హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడు పోస్టు మరియు పిజికల్ డైరక్టర్ పోస్టు కొనసాగించాలని, విజ్ఞప్తి చేశారు.