తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం

0
303

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణలో వేసవి సెలవులు పూర్తై కొత్త విద్యా సంవత్సరంలో భాగంగా జూన్ 13వతేది సోమవారం నుంచి ప్రభుత్వ బడులు తెరుచుకొంటున్నాయి. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టడం, వాతావరణంలో మార్పులు రావడంతో వేసవి శెలవులను మరింత కాలం పొడిగిస్తారనే ఉహాగాహనాలు జరిగాయి. అయితే ఏట్టి పరిస్థితులలో వేసవి శెలవులు పొడిగించే ప్రసక్తే లేదని, పాఠశాలలను తెరవాల్సిందేనని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఇప్పుటికే విద్యావ్యవస్థ అతాకుతులం అయిందని ఈ పరిస్థితులలో ప్రభుత్వం పునరాలోచన చేయదని, విద్యా సంస్థలు సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని కోరారు. దీంతో సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బడి గంటలు మోగనున్నాయి. అయితే ఏపిలో మాత్రమే పాఠశాలలు జులై 4 నుంచి ప్రారంభం కానున్నాయి.