ఘనంగా మదనపల్లి జెడ్.పి.హైస్కూల్ పూర్వ విద్యార్థుల(1998-99) సమావేశం

0
369

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో 10వతరగతి విద్యాబ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమావేశం జూన్12వతేది ఆదివారం స్థానిక జెడ్.పి.హెస్కూలు ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకొన్నారు. సహాద్యాయిలు గతాన్ని గుర్తుకు తెచ్చుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్వ విద్యార్థుల నాటి ప్రధానాపోధ్యాయురాలు శ్రీమతి సుభాషిణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మదనపల్లి జెడ్.పి.హైస్కూలు విద్యాబ్యాసం చేసిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లారని, ఎంతో ప్రయోజకలయ్యారని అన్నారు. విద్యార్థులు తమకు విద్యను బోధించిన గురువులను గుర్తించి సన్మానించడం ద్వారా తాము ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో మంచి విద్య అందుతుందని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందుకే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు రాజారెడ్డి, హనీష్,శంకర, కృష్ణమూర్తి, ప్రమీల, అరుణకుమారి, శ్యామల, శైలజ, అమరావతి, షర్మిల, పద్మావతి, శకుంతల లను పూర్వ విద్యార్థులు శాలువలతో ఘనంగా సత్కరించారు. 1998-99 పూర్వవిద్యార్థుల సమావేశం నిర్వహణలో నాటి విద్యార్థులు చేతన్ రాజు, భాస్కర్, ఖాదర్ వలి, సుధాకర్, పవన్,ఆనంద్, నాగేంద్ర, సుబ్బు తదితరులు ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. సమావేశం అనంతరం పూర్వ విద్యార్థులు విందు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

# madanapalle 
# zphs high school
# z.p.high school