అన్నమయ్య జిల్లా APUS అధ్యక్షుడుగా రమణారెడ్డి

0
287

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా రమణారెడ్డి ఎన్నికయ్యారు. ఇటివల రాయచోటి లో జరిగిన సంఘం సర్వసభ్యసమావేశంలో ఈయనను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డిని పలువురు ఏబివిపి నాయకులు, మిత్రులు మదనపల్లిలో ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో సంఘం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, వారి నమ్మకాన్ని నిలుపుతానని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తానని అన్నారు. ఏపి ప్రభుత్వం ఇటివల తీసుకొచ్చిన పాఠశాలల విలీనం ప్రక్రియను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని
రమణారెడ్డి డిమాండ్ చేశారు.

May be an image of 6 people, people sitting and people standing