
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతికి ఇదే చివరి సమావేశం. వచ్చే సమావేశాలు ప్రారంభం నాటికి వీరి పదవీ కాలం ముగుయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి2వ తేది నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగనుంది. బడ్జెట్ తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండవ దశ సమావేశాలు మార్చి14 నుంచి ఏప్రిల్ 8వ వరకు జరగనున్నాయి.
పార్లమెటు ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం ప్రధాన హైలెట్స్
- దేశప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాతంత్య్ర, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
- కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నానని అన్నారు. దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యమని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోంది అన్నారు.
- – ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని, ఇప్పటివరకు 28 లక్షలమంది వీధి వ్యాపారులు ఆర్థిక సాయం పొందారన్నారు. వీధి వ్యాపారులను ప్రభుత్వం ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తోందని, ఏడు మెగా టెక్స్టైల్ పార్కులతో భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఎంఎస్ఎంఈలకు చేయూత కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలు లభించినట్లు చెప్పారు
- ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు.
- ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు.