
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
- ఏపిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగాా 26 లోకసభ స్థానాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా, నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లాలు ఉన్నాయి.
- ఏపిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని ఇందిరా ప్రియదర్విని స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
- మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. తనను ఇటివల కలిసిన వారందరూ పరీక్షలు చేసుకోని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను హోం ఐసోలేషన్ లో ఉంటున్నానని తెలిపారు. త్వరలో మళ్లీ అందరి ముందుకు వస్తానని అన్నారు.
- ఏపిఎస్ ఆర్.టి.సి తాము నడుపుతున్న ఆర్టీసీ ఎసి బస్సులలో ఆక్యుపెన్సీని పెంచుతూ.. ప్రైవేటు బస్సుల పోటిని తట్టుకొని ఆదాయాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రద్దీని బట్టి భస్సు చార్జీలు పెంపు తగ్గింపు వంటి చర్యలు తీసుకోనున్నారు.
- తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను అందుకొన్నవారిలో ప్రవచనకారుడు గరికపాటి నరిసింహారావు, విశాఖపట్టణానికి చెందిన ఆర్థో పెడిక్ డాక్టర్ వెంకట ఆదినారాయణ రావు, సినీ నటి షావుకారి జానకి, కూచపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి, కోయ గిరిజన నాయకుడు రామచంద్రయ్య, జానపత కళాకారుడు మెుగిలయ్యలకు ప్రకటించారు.
- ఏపి టాస్క్ పోర్సు, తిరుపతి విభాగం వారు ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. భాకరాపేట ప్రాంతంలో దుంగలు తీసుకెళ్లుతుండగా పోలీసులు వల పన్ని పట్టుకొన్నారు.
- విశాఖ జిల్లా కొయ్యూరు వద్ద గల డౌనూరు చెక్ పోస్టు వద్ద గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలిస్తుండగ సినిమా పక్కీలో తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో చెరువులోకి దూకడంతో వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకొన్నారు.
- ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమల శాంతిభద్రతల విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) గా పనిచేస్తున్న ఎం.ముని రామయ్యను విధుల నుంచి తప్పించి ఆయనిని బదిలీ చేస్తూ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముని రామయ్య హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
- సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్రావును ఎంపిక చేశారు. చాలా కాలంగా ఆర్గనైజేషన్లో విధులు నిర్వర్తిస్తోన్న అనుభవం ఉండటంతో ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తెలిపింది.
- కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా జనవరి25 అన్ని రకాల దర్శనం టికెట్లను భక్తులు ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది.
శ్రీశైలం దేవస్థానం ఆన్ లైన్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.