ఏపి టాప్ 10 న్యూస్ @ manachannel.in

0
187

మనఛానల్ న్యూస్ -అమరావతి

  1. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల కమిటితో పి.ఆర్.సి పోరాట సమితి నుంచి 9 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటి సమావేశం అయింది. అశుతోష్ కమిటి రిపోర్టు భయట పెట్టాలి, పి.ఆర్.సి. జి.వోలు రద్దు చేయడం, మూడు డిమాండ్లు పెట్టారు. 27వ తేదిన మళ్లీ రావాలని మంత్రుల కమిటి ఆహ్వానించింది.
  2. ఏపిలో ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి రద్దుపై ఉద్యమం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
  3. ఏపిలో వై.ఎస్.జగన్ ప్రభుత్వం మంగళవారం ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్యు, క్షత్రియ, వెలమ లాంటి అగ్ర వర్ణ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఈబిసి నెస్తం పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది మహిళలు లబ్ది పొందనున్నారు. ఈపథకం కింద అర్హులైన మహిళలకు ప్రతిఏటా రూ.15వేలు ఇస్తారు. ఇందుకోసం హిళ ఖాతలాల్లో రూ.589 కోట్లు నగదును మంగళ వారం ఒకే సారి జమ చేశారు.
  4. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై తప్పుడు విద్యార్హతలు చూపారని సిఐడి సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో ఎసిటిఓ ఉద్యోగం సమయంలో తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించడమే గాక, ఎన్నికల అఫిడివిట్ లో సైతం నకిలీ సర్టిఫికెట్లు జమచేయడంపై కేసు నమోదు అయింది.
  5. విజయవాడ నుంచి గుడివాడకు వెళ్లుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందమును విజయవాడ పోలీసులు అడ్డుకొన్నారు.
  6. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటే కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ అధికారులు తెలిపారు.
  7. ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు.రాబోయే రెండు రోజుల్లో జిల్లాలకు పేర్లు, సరిహద్దుల వివరాలతో నోటిఫికేషన్ రానుంది.
  8. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి ఆఫీసు నుంచి రోజు నన్ను, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కొంత మంది మహిళలతో తిట్టుస్తున్నారని, దీనిని ఆపితే తాను చంద్రబాబును తిట్టడం మానుకొంటానని అన్నారు.
  9. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో త్వరలో ఏర్పాటు కానున్న ఫిషరీస్‌ యూనివర్సిటీ కార్యకలపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటికి చెందిన భవనాల నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో ఆ లోపు కొత్త విద్యాసంవత్సరం (2022–2023) ప్రారంభించి వాటి కోర్సుల తరగతులు నిర్వహించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
  10. మార్చి 27 నుంచి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు వైజాగ్ చెన్నై బెంగళూరు మహా నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. ఇక నుంచి విజయవాడకూ విమానాలు నడవనున్నాయని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.