
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
- ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా సమాజ్ వాది పార్టీ మంగళవారం 159 మంది అభ్యర్థుల తుది జాబితాను పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎస్పీ సామాజిక సమతూకాన్ని పాటించింది. అభ్యర్థుల జాబితాలో వెనుకబడిన వర్గాలకు సమాన ప్రాతినిథ్యం ఇవ్వగా, యాదవ్ – ముస్లిం అంశంపై కూడా జాగ్రత్తపడింది. ఎస్పీ కొత్త జాబితాలో 31 మంది ముస్లింలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 18 మంది యాదవులు, ఏడుగురు కుర్మీలు, ఏడుగురు జాట్లు, నలుగురు నిషాద్‌లు, నలుగురు గుర్జర్లు, ఏడుగురు జాట్లు కూడా రంగంలోకి దిగారు. ఎనిమిది మంది బ్రాహ్మణులు, ఐదుగురు ఠాకూర్లు, ఆరుగురు వైశ్యులు, ఇద్దరు సిక్కు సామాజికవర్గ అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.
- పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.
- కొత్త ఓటర్లుకు ఓటర్ కార్డును తఫాలా ద్వారా పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అలాగే ఓటింగ్ యంత్రం ఏవిధంగా పనిచేస్తుందని సమాచారాన్ని తెలిపే సమాచార పత్రాన్ని అందులో అందిస్తామని పేర్కొంది.
- మహారాష్ట్రలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై నుంచి కారు పడిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌డేల్ సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మరణించారు.
- ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’తో ఈ రెండు ఓటీటీ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం 54 మిలియన్ డాలర్లు(దాదాపు 400 కోట్ల రూపాయలు) ఒప్పందం చేసుకున్నాయి.
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలో అత్యంత పాపులర్ న్యూస్ సంస్థ పాక్స్ న్యూస్ జర్నిలిస్ట్ పీటర్ డూసీని బండబూతులు తిట్టారు.అమెరికాలో నెలకొన్న ద్రవోల్బణంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయంలో వాట్ ఏ స్టు పిడ్ అంటూ తిట్టడం పెద్ద సంచలనంగా మారింది. అనంతరం బైడెన్ సావధానంగా సారీ చెప్పారు.
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను జనవరి 25న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యులర్ నకిలీవని సి.బి.ఎస్.ఇ. బోర్డు అధికార ప్రతినిధి రామశర్మ ఈరోజు ట్విటర్ ద్వారా తెలిపారు
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో జంపింగ్ రాయుళ్లు పెరిగిపోయారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ(Congress)కి మాజీ కేంద్ర మంత్రి ఒకరు షాకు ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్పీఎన్ సింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి సమర్పించారు
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందంకలిసింది. ఈసందర్భంగా వారు వివిధ విషయాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందనివారు ఫిర్యాదు చేశారు వనమా రాఘవా దాష్టికాలు, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అద్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనల గురించి గవర్నర్‌కు వివరించారు.
- జనవరి26 తేదిన రిపబ్లిక్ డే సందర్భంగా గ్యాలంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు. 939 మంది పోలీసు సిబ్బంది వారి ధైర్యసాహసాలకు గాను గ్యాలంట్రీ అవార్డులతో సత్కరించనున్నారు. ఇందులో 189 మంది వీరులకు పోలీస్ మెడల్ అందజేయనున్నారు.88 మంది ధైర్యవంతులకు విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకం, 662 మంది ప్రతిభ కనబర్చినందుకు పోలీసు పతకం అందచేయనున్నారు.
- దేశంలో గత 24గంటలలో 255874 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత రోజు కంటే నేడు దాదాపు 50వేల కేసులు తగ్గాయి. కేరళలో భారిగా కేసులు పెరిగాయి. మంగళవారం ఉదయానికి 55475 కేసులు నమోదు అయ్యాయి.
- ఏపిలో 13819 కేసులు నమోదు అయ్యాయి. 5716 మంది రికవరీ అయ్యారు. అన్ని జిల్లాలో కేసులు పెరిగాయి. చిత్తూరు జిల్లాలో గతం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. 46929 శాంపిల్స్ పరీక్షించారు.
- ఓమిక్రాన్ నివారణకు ఫైజర్ మరియు బయోఎన్‌టెక్ సంస్థలు ప్రత్యేక టీకా ను రూపోందించాయి. ఇందుకోసం క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించినట్లు ఆసంస్థలు ప్రకటించాయి. 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల 1,420 మంది ఆరోగ్యవంతమైన పెద్దలలో ఈట్రయల్ రన్ చేశారు.
- ఇండోనేషియాలోని వెస్ట్ పాపువాలోని కరోకే బార్‌కు ఆ ప్రాంతంలోని కొంత మంది యువకులు రెండు వర్గాలుగా చీలి పోయి ఘర్షణ పడ్డారు. ఈఘర్షణ కారణంగా సుమారు 19 మంది మరణించారు.
- ఆఫ్రికా దేశం కామెరూన్ రాజధాని యౌండేలోని పాల్ బియా స్టేడియంలో జరుగుతున్న ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగే మైదానం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 8మంది మరణించారు. మృతులలో అధికంగా 14 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. కామెరూనియన్ అధ్యక్షుడు పాల్ బియా సంతాపం తెలిపి విచారణకు ఆదేశించారు.
- విదేశీ విరాళాలు పొందేందుకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోని స్వచ్ఛంద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ 6వేల సంస్థలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
- కరోనా ఎండమిక్ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు.
- మధ్య ఆసియా దేశాలైన కజికిస్తాన్,ఉజిబికిస్తాన్,కిర్గిస్తాన్ దేశాలలో భారీ విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో లక్షలాది మంది ప్రజలు మంగళవారం గంటల తరబడి కరెంటు లేకుండా పోయారు.దీంతో ట్రాఫిక్ జామ్‌లు, విమానాశ్రయం ఆలస్యం మరియు ఇతర ప్రజా రవాణా అంతరాయాలకు కారణమైంది.