ఏపిలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె బాట

0
159

మనఛానల్ న్యూస్ – అమరావతి
కొత్త పి.ఆర్.సి. అమలు నిలిపివేయాలని కోరుతూ ఏపి ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటిసు అందించారు. తాము చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని పి.ఆర్.సి. సాధన సమితి తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంకాలం 4 గంటలకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి లేనందున జిఐడి ఛీఫ్ సెక్రటరి శశిభూషణ్ కుమార్ 20 మంది పి.ఆర్.సి సాధన సమితి సభ్యుల బృందం కలిసి సమ్మె నోటిసు అందించారు. దీంతో ఉద్యోగులు ఫిబ్రవరి 6వ తేది అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు.