ఈ రోజు వార్తలు @ manachannel.in

0
90

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  • ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మద్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటిసు ఇవ్వనున్నారు.
  • పూణే- అహ్మాదాబాద్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైక్ లు ఢీ కొనడంతో 5 మంది మరణించారు.
  • సోమవారం ఉదయానికి దేశంలో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,06,064 గత రోజు కంటే ఈ రోజు 27వేల కేసులు తగ్గాయి.439 మరణాలు సంభవించాయి. పాజిటివ్ రేటు 20.75శాతం ఉంది.
  • సోమవారం ఉదయానికి దేశ వ్యాప్తంగా 162.73కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి అయినట్లు కేంద్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు.
  • బీహార్ లో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి నారాయణ ప్రసాద్ కుమారుడు తుఫాకితో కాల్పులు జరపడంతో నలుగురు పిల్లలు గాయపడ్డారు.
  • జీన్-జాక్వెస్ సావిన్ అనే 75 ఏళ్ల ఫ్రెంచ్ సాహసికుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఒంటరిగా ప్రయాణించే ప్రయత్నంలో మరణించాడు
  • పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విమానాలు ఫిలిప్పీన్ సముద్రంలో యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ నేవీలు భారీ బలప్రదర్శన చేసిన ఒక రోజు తర్వాత వచ్చాయి, ఇందులో రెండు US నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, రెండు US ఉభయచర దాడి నౌకలు మరియు ఒక జపనీస్ ఉన్నాయి.
  • పి.ఆర్.సిపై ఉద్యోగ సంఘాలు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కొత్త పి.ఆర్.సిలో ఉద్యోగుల బెనిపిట్స్ తగ్గడంపై గెజిటిడ్ ఉద్యోగ సంఘం వేసిన పిటిషన్ పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది.