AP Covid News: ఏపిలో 14440 పాజిటివ్ కేసులు – 4 గురు మృతి – 46650 శాంపిల్ పరీక్షలు

0
136

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో కరోనా కేసుల సంఖ్య శర వేగంగా చొచ్చుకుపోతోంది. కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరిగిపోతున్నాయి. అన్నిప్రాంతాలలో కరోనా కేసులు పెరిగిపోయాయి. జలుబు, దగ్గు, జ్వరం,గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో జనం అల్లాడుతున్నారు. కోవిడ్ టెస్ట్ లు జరగపోయినప్పుటికి ఈ లక్షణాలు ఉన్న వారు అన్ని ప్రాంతాలలో కనిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర జనాభాలో 40శాతం పైబడి ప్రజలు కరోనాతో ప్రస్తుతం ఇబ్బందిపడుతున్నారు. ఆదివారం నాటికి ఏపిలో 46650 పరీక్షలు నిర్వహించగ, 14440 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో విశాఖపట్టణం జిల్లాలో 2258 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు, చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, నెల్లూరు జిల్లాలో 1103కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1012 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 921 కేసులు,వై.ఎస్.ఆర్.కడప జిల్లాలో 788కేసులు, విజయనగరం జిల్లాలో 614, పశ్చిమగోదావరి జిల్లాలో 613కేసులు, కృష్ణా జిల్లాలో 304 కేసులు నమోదు అయ్యాయి. ఏపిలో నేటివరకు 3,21,47,031 శాంపిల్ పరీక్షలు నిర్వహించారు.గత 24 గంటలో రాష్ట్రంలో 3969 మంది రికవరీ అయ్యారు.

Image