AP Covid News: ఏపిలో కరోనా విజృంభణ – 13వేల కేసులు – 5 మరణాలు

0
164

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండాా ఎక్కడ చూసిన జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునోప్పులతో బాథపడే వారు అధికంగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30-40శాతం ప్రజలకు ఈ లక్షణాలు ఉన్నట్లు అంచనా . దీనిని ప్రభుత్వ అధికారులు పెద్దగా సీరియస్ గా తీసుకొంటున్నట్లు కనిపించడం లేదు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకొన్న వారు ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధరణ మందులు మింగుతూ వ్యాధి నయం చేసుకొంటున్నారు. సీరియస్ అయితే ఆసుపత్రులకు వెళ్లుతున్నారు. కొన్ని చోట్ల చలి కాలం కావడంతో
దీనిని సీజనల్ వైరల్ ఫీవర్ గా భావించి గ్రామాలలో ఆర్.ఎం.పి వైద్యుల వద్ద చికిత్స తీసుకొంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే చాలా మంది ఉపాధ్యాయులు, విద్యార్థులలో కోవిడ్ లక్షణాలతో కనిపిస్తున్నారు. వీరికి ఏలాంటి కోవిడ్ పరీక్షలు జరపడం లేదు. దీంతో విచ్చల విడిగా వైరస్ వ్యాప్తి జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల శాంపిల్ పరీక్షలు ఆసక్తి ఉన్న వారు మాత్రమే చేయించుకొంటున్నారు. లక్షణాలు భయట కనిపించని కోవిడ్ వ్యాధి గ్రస్తుల సంఖ్య అధికంగా ఉంది. వీరి వల్ల కూడ వైరస్ వ్యాప్తి అనుహ్యాంగా జరుగుతోంది. గత 24గంటలో 44516 మంది కరోనా శాంపిల్ పరీక్షలు నిర్వహించగ, 13212 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 మంది మరణించారు. ఈ రోజు నమోదు అయిన కేసుల విషయానికి వస్తే విశాఖ జిల్లాలలో 2వేలకు పైబడి పెరగగ, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో వెయ్యికిపైబడి కేసులు నమోదు అయ్యాయి.ఇక మిగిలిన జిల్లాల్లో 500నుంచి 900లోపు కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జలుబు, దగ్గు,జ్వరం పీడిత వ్యాధి గ్రస్తులకు శాంపిల్ పరీక్షలు నిర్వహిస్తే రోజుకు 50వేలకు పైబడి పాజిటివ్ కేసులు నమోదు అవుతాయనడంలో సందేహం లేదు.