గ్రామాన్నే బ్యాంక్ లో తాకట్టు పెట్టి రుణం తీసుకొన్న ఘనులు

0
164

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
అక్రమార్కులు తమ తెలితేటలతో ఎవరినైన బురిడి కొట్టిస్తారు. అందినంత దోచుకొనేందుకు వెనుకాడరు. అవినీతి అధికారుల సహకారంతో ఎంతకైన తెగిస్తారనే సంఘటన ఇటివల ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం త్రిపురపురం గ్రామం సిద్దనపాలెం జరిగింది. ఈ గ్రామం స్థానిక రెవెన్యూ రికార్డులలో సర్వే నెం. 296లో ఉంది. గ్రామ విస్తీర్ణం 8.14 ఏకరాలలో ఉంది. ఇది గమనించిన ఇరువురు స్థానికులు గ్రామం భూమిని రెండుగా విభజించి చెరో సగం తమ పేర్లతో రెవెన్యూ రికార్డులో ఆన్ లైన్ లోకి ఎక్కించారు.గుట్టు చప్పుడు కాకుండ యర్రగొండపాళెం పిడిసిసి బ్యాంకులో తమ పేరుతో ఆన్ లైన్ లో ఎక్కించుకొన్న పేపర్ల ను తనఖా పెట్టి డబ్బులు తీసుకొన్నారు. ఈ విషయం ఇటివల గ్రామస్థులకు తెలియడంతో అవాక్కు అయి, మండల తాహిశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తమ గ్రామాన్ని ఆ ఇద్దరి పేరిట ఆన్ లైన్ లో ఎక్కించి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోమని వారు విజ్ఞప్తి చేశారు.