మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
తెలుగు సినిమాలలో సంచలన సృష్టించిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1,2021 న విడుదలై విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్థంబాలైన రాజకీయ, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థల సామర్థ్యాలను తెలియ చేసే చిత్రమే రిపబ్లిక్. రాజకీయ వ్యవస్థ మిగిలిన వ్యవస్థల కంటే తామే గొప్పగా భావించి మిగిలిన వ్యవస్థలను నియంత్రించడం వల్ల జరిగే దుష్పరిణమాలను ఈ చిత్రంలో చక్కగా వివరించారు. రిపబ్లిక్ ఇప్పుటికే (OTT)ఒటిటిలో సైతం మంచి సందడే చేసింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ-తెలుగు టివిలో ఈనెల 23వ తేదీన సాయంకాలం 6గంటలకు ప్రసారం చేయనున్నారు. సాయి ధరమ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులు ఈ సినిమా లో నటించారు. దేవా కట్టా దర్శకత్వం వహించారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, ప్రతి నాయిక పాత్ర విశాఖ వాణిగా రమ్యకృష్ణ నఅదరగొట్టారు వీక్షకులు చూడడం మరిచి పోకండి. జనవరి 23 సాయంకాలం 6గంటలకు …