మదనపల్లిలో మద్యం మత్తులో దారుణం – గ్రామదేవతకు పొట్టేలుకు బదులు యువకుడు బలి

0
465

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం సంక్రాంతి పండుగ వేళ ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డారు. మదనపల్లి మండలం వలసపల్లి లో సంక్రాంతి పండుగ ముగింపు రోజున ఆదివారం కనుమ సందర్భంగా గ్రామస్తులు గ్రామ దేవతకు జంతువులు బలి ఇచ్చి బంధువులకు విందులు ఇస్తారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామానికి చెందిన తలారి గంగన్న కుమారుడు చలపతి పూటుగా మద్యం సేవించారు. గ్రామదేవత వద్ద పొట్టేలను బలి ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా పొట్టేలును పట్టుకొని వచ్చిన తలారి సురేష్ అనే వ్యక్తిని తాగుబోతు చలపతి కొడవలితో నరికేయడంతో తీవ్ర రక్త స్రావం అయింది. వెంటనే అతనిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగ డాక్టర్లు చికిత్స నిర్వహిస్తుండగానే మరణించారు. మృతుడు సురేష్ వయసు 35 సంవత్సరాలు, ఇతనికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. దారుణానికి పాల్పడిన తాగుబోతు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.