దేశంలో తగ్గని కరోనా కేసులు- నేడు 2.58 లక్షల కొత్త కేసులు – 385 మరణాలు

0
193

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇన్ఫెక్షన్ అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ప్రజలకే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకొని బాధ్యతను వారికే అప్పగించిన (మన ఆరోగ్యం – మన చేతుల్లోనే) పరిస్థితులు కనిపిస్తున్నందున కేసుల సంఖ్య అధిక అవుతున్నాయి. కరోనా వ్యాప్తి రాకెట్ వేగంగా కన్నా మరింత వేగంగా దూసుకుపోతోంది. సోమవారం ఉదయానికి దేశంలో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 2,58,089 కాగా, మరణాల సంఖ్య 385కి చేరింది. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8209కి చేరాయి. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య భారిగా పెరుగుతున్నాయి. 30 జిల్లా కరోనా పాజిటివ్ రేటు 22 శాతం 25శాతం లోపు మిగిలిన జిల్లాల్లో 15శాతం మేర నమోదు అయింది. బెంగళూరు అర్బన్ లో 22.3శాతం, బెంగళూరు రూరల్ లో 19.9శాతం పాజిటివ్ రేటు రికార్డు అయింది. ఢిల్లీలో 14వేలనుంచి 15వేల లోపు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అర్హత కలిగిన వారందరకి 100శాతం తొలి డోసు వ్యాక్సిన్ వేశారు. 2వ డోసు వ్యాక్సిన్ 80శాతం మేర పూర్తి అయింది. ప్రికాషన్ డోస్ వ్యాక్సిన్ 1.28లక్షల మందికి వేశారు.దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయానికి 158.12 కోట్ల వ్యాక్సిన్ డోసు వేశారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 13.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో జనవరి1 నుంచి నమోదు అయిన కరోనా కేసులు – మరణాలు

జనవరి1 వతేది కేసుల సంఖ్య 22,775 మరణాల సంఖ్య 406
జనవరి 2వతేది కేసుల సంఖ్య 27,553 మరణాల సంఖ్య 284
జనవరి 3వతేది కేసుల సంఖ్య 33,750 మరణాల సంఖ్య 123
జనవరి4 వతేది కేసుల సంఖ్య 37,379 మరణాల సంఖ్య 124
జనవరి5 వతేది కేసుల సంఖ్య 58,097 మరణాల సంఖ్య 534
జనవరి6 వతేది కేసుల సంఖ్య 90,928 మరణాల సంఖ్య 325
జనవరి7 వతేది కేసుల సంఖ్య 117,100 మరణాల సంఖ్య 302
జనవరి8 వతేది కేసుల సంఖ్య 141,986 మరణాల సంఖ్య 285
జనవరి9 వతేది కేసుల సంఖ్య 159,632 మరణాల సంఖ్య 327
జనవరి10 వతేది
కేసుల సంఖ్య 179,723 మరణాల సంఖ్య146
జనవరి11 వతేది కేసుల సంఖ్య 168,063 మరణాల సంఖ్య 277
జనవరి12 వతేది కేసుల సంఖ్య 194,720 మరణాల సంఖ్య 442
జనవరి13 వతేది కేసుల సంఖ్య 247,417 మరణాల సంఖ్య 380
జనవరి14 వతేది కేసుల సంఖ్య 264,202 మరణాల సంఖ్య 315
జనవరి15 వతేది కేసుల సంఖ్య 268,833 మరణాల సంఖ్య 402
జనవరి16 వతేది కేసుల సంఖ్య 271,202 మరణాల సంఖ్య 314
జనవరి17 వతేది కేసుల సంఖ్య 258,089 మరణాల సంఖ్య 385