ఏపిలో కరోనా వేళ విద్యాశాఖ వింతదోరణి – విద్యాసంస్థల మూసివేతలో దేశమంతా ఒకదారి ఏపిది మరో దారి

0
580

మనఛానల్ న్యూస్ – అమరావతి
కరోనా విజృంభన వేళ దేశమంతా విద్యాసంస్థల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఒక దారిలో వెళ్లుతుంటే ఏపి లో విద్యాశాఖ తనదారి అందరి దారి కాదని విద్యాసంస్థలు మూసివేత ప్రశ్నే లేదని వింత దోరణితో వ్యవహరించడం విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావి వర్గాలకు విస్మయం కల్గిస్తోంది.సంక్రాంతి సెలవులు ప్రారంభం నుంచి ఏపిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. శని,ఆదివారాలలో కలిపి 10వేల పాజిటివ్ కేసులకు చేరుకున్నాయి. మరో వారంలోపు రోజుకి 20 నుంచి 30వేలకు కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్షణాలు కనిపించని కరోనా కేసులు భారిగా ఉన్నాయి. పగడ్బందిగా పరీక్షలు జరిపితే కేసుల సంఖ్య లక్షల్లో తేలే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే విద్యార్థులు, యువత విద్యాసంస్థల వద్ద అధికంగా గుమిగూడితే కొత్త వేరియంట్లు పుట్టి, వీరి ద్వారా రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వయోజనులకు సంక్రమిస్తే కరోనా రోగుల సంఖ్య అధికంగా పెరిగి ఆసుపత్రులలో చేరే కేసులు ఒక్కసారి అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన మహారాష్ట్ర్ర, తమిళనాడు, కర్నాటక,ఒడిస్సా, తెలంగాణ ప్రభుత్వాలు ఫిబ్రవరి1వతేది వరకు అన్ని విద్యాసంస్థలను మూసి వేశారు. ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను గుర్తించి వాటిని గుణపాఠాలుగా భావించి, వారి మార్గంలో నడవాల్సిన ఏపి విద్యాశాఖ వింతదోరణితో వ్యవహరిస్తూ ప్రజలలో విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. గతంలో కరోనా రెండవ వేవ్ సమయంలో పదవతరగతి పరీక్షలు తాము తప్పక నిర్వహిస్తామని ఇదే విధంగా మెుండి వైఖరితో వ్యవహారించి విద్యార్థుల తల్లిదండ్రుల వ్యతిరేకత మరియు హైకోర్టు చివాట్లుతో తమ నిర్ణయాన్ని వెనిక్కి తీసుకొన్నారు. రాష్ట్రంలో ఇంత భారీగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో కొంత కాలం పాటు విద్యాసంస్థల మూసివేయడం వల్ల కరోనా వ్యాప్తి కొంత మేర తగ్గించవచ్చు. ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రైవేటు విద్యాసంస్థలకు ఉపయోగకరంగా మారిందని, రీ ఓపెనింగ్ రోజున తమకు 100శాతం ఫీజు చెల్లించాలని, లేని పక్షంలోక్లాసులకు హాజరు కానివ్వమని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఫీజులు వసూలు చేసుకోవడానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నాయి.

భవిష్యత్ లో ఇలాంటి కరోన విపత్కర పరిస్థితు లు వస్తాయనే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులకు అర్థ సంవత్సరం పరీక్షలు ఇప్పటికే నిర్వహించారు. రాబోయే రోజులలో కరోనా తగ్గని పక్షంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేక పోతే అర్థ సంవత్సరం పరీక్షలను ప్రామాణికంగా తీసుకొని ఫైనల్ పరీక్షలకు మార్కులు వేయాలని ప్రభుత్వం భావించింది. ఈనేపథ్యంలో కొంత కాలం విద్యాసంస్థలను మూసివేయడం వల్ల ఏమాత్రం నష్టం లేదని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇతర రాష్ట్రాల విధానాలను అనుసరించాలే గాని వింతగా, మెుండి గా వ్యవహారించడంవల్ల ప్రభుత్వానికే చెడ్డపేరని సంబంధిత వర్గాలు గుర్తించాలి.