ఈ రోజులు ప్రధాన వార్తలు ఇవే…

0
149

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  • పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 10,14వ తేదీలలో రెండు విడతలుగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఫిబ్రవరి 20వతేదీన ఒకే మారు నిర్వహించేందుకు చర్యలు తీసుకొన్నారు. ఫిబ్రవరి10 నుంచి 16వరకు బెనరస్ లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఎన్నికల నిర్వహణను మార్పు చేశారు.
  • సోమవారం ఉదయానికి దేశంలో 2,58.089 కరోనా పాజిటివ్ కేసులు, 385 మరణాలు, 8209 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
  • ద్విచక్ర వాహనాల పన్ను శ్లాబు ను విలాాసవంత పన్ను GST 28+2 Cess నుంచి GST 18శాతం శ్లాబు కు మార్చాలని పెడరేషన్ ఆఫ్ ఆటోమెుబైల్ డీలర్స్ అసోషియేన్ (FADA) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం సమర్పించింది. ఫిబ్రవరి1న జరిగే కేంద్ర బడ్జెట్ లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. జి.ఎస్.టి 18శాతం శ్లాబు కింది వస్తే ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయి.
  • తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా సోకింది. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. తనను కలిసినవారు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
  • ఏపిలో కోవిడ్‌ పరిస్థితులపై సి.ఎం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు గురించి సి.ఎం. అధికారులతో చర్చించారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచినట్లు అధికారులు సి.ఎం.కు వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.