
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలోవిద్యాసంస్థలను ఈ నెల 30వ తేదివరకు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి8 నుంచి 17 వరకు ఇప్పుటికే విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఆదివారం నాటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అధికంగా బహిరంగ ప్రదేశాలకు రాకుండ నిరోధించవచ్చు. అలాగే విద్యాసంస్థలలో విద్యార్థులు అధికంగా గుంపులుగా చేరుతారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు ఉన్నందున కొంత మేరకు కరోనా నివారణకు ఈ సెలవులు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నాయి. ప్రభుత్వం కూడ దీనిపై త్వరలో నిర్ణయించే అవకాశం ఉంది.
ఏపి పరిస్థితి ఏమిటి…???
ఏపిలో పరిస్థితి కూడ తెలంగాణాలో మాదరిగా కేసుల సంఖ్య భారీగానే ఉంది. తెలంగాణాతో పోలిస్తే రోజువారి టెస్ట్ ల సంఖ్య కొంత మేర అధికంగా ఉండడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
కూడ భారిగా పెరుగుతోంది. శనివారం నాటికి 5వేలు కేసులు ఉన్నాయి. రాబోయే రోజులలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో లక్షణాలు కనిపించని విద్యార్థులు, యువత అధికంగా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే కేసుల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఏపిలో కూడ విద్యాసంస్థలకు కూడ సెలవులు ప్రకటిస్తారనే సమాచారం అందుతోంది. సోమవారం ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.