చిరంజీవి ఆచార్య విడుదల వాయిదా

0
466

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
తెలుగు సినిమాల విడుదలకి కరోనా పెద్ద అడ్డంకిగా మారుతోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు కరోనా పరిస్థితులలో తమ సినిమాలను అనుకొన్న తేదీలలో రిలీజ్ చేయడానికి సాహసం చేయలేకపోతున్నారు. ఇప్పుటికే జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలను వాయిదా వేశారు. అదే బాటలో రాధశ్యామ్ నిలిపివేయగ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ఫిబ్రవరి 24వతేదీన విడుదల చేయాలని నిర్ణయించగ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య విడుదలను తాత్కలికంగా నిలిపి, తదుపరి తేది ప్రకటించేవరకు వాయిదా వేస్తున్నట్లు సంక్రాంతి పండుగ రోజు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలలో గత 10రోజులుగా కరోనా మళ్లీ విజృంభన ప్రారంభమైంది. ఈ పరిస్థితులలో సినిమా థియోటర్లలలో 50శాతం సీటింగ్ కెపాసిటితో సినిమాలు రన్ చేసుకోమని ప్రభుత్వాలు చెప్పాయి. 50శాతం సీట్లతో సినిమా థియోటర్లు నడిపే విధానం వల్ల నిర్మాతలు, ఎగ్జిబీటర్లు తీవ్ర నష్టాలపాలు అవుతారు. భారీ బడ్జెట్ సినిమాలకు కరోనా నిబంధనలు తీవ్ర అడ్డంకిగా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు సినిమా థియోటర్ల వద్ద భారిగా ప్రేక్షకులు పోగు అవుతారు. దీనివల్ల మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను తాత్కలికంగా నిలిపి, విడుదలను వాయిదా వేసి, కోవిడ్ పరిస్థితులు చక్కబడిన అనంతరం తమ సినిమాలు విడుదల చేయాలని పెద్ద హీరోలు భావిస్తూ తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఆర్.ఆర్.ఆర్., రాధా శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు కోవిడ్ తగ్గిన అనంతరం అన్ని అనుకూలిస్తే ఉగాధికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.