
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ప్రముఖ సినీ నటుడు, హిందుపురం ఎం.ఎల్.ఏ నందమూరి బాలకృష్ణ శనివారం ప్రకాశం జిల్లా కారంచేడులో తన అక్క పురందేశ్వరీ ఇంట్లో సంక్రాంతి సంబరాలలో పాల్గోన్నారు. బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన వాతవరణంలో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్రంపై చేసిన స్వారీ ఎంతో హైలెట్ గా నిలిచింది. బాలకృష్ణ గుర్రంపై కూర్చోని కళ్లెం చేతులు పట్టుకొని లాగుతుండగ, డప్పులు చప్పుడుకు గుర్రం ఒకే చోట నిలుచుని వేసిన అడుగులకు తగ్గట్టు గుర్రం నిల్చుని ఉరకలు తీసిన విధానం చూపురులను ఎంతో ఆకట్టుకొెంది. గుర్రపు స్వారీ చేసిన అనుభూతిని కల్గించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకృష్ణ తన భార్య వసుందరతో కలిసి రెండు రోజులుగా తన అక్క బావలు దగ్గుబాటి పురందేశ్వరీ,దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంతో గడిపారు.

