Today Latest News: ఈ రోజు టాప్-10 న్యూస్ @ manachannel.in

0
134

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

సంక్రాంతి సంబరాలను తన నివాసంలో తీలకిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్
 1. దేశంలో గత 24 గంటలలో 2.64 లక్షల కరోనా కేసులు నమోదు కాగ, 315 మంది మరణించారు. 1,09,345 మంది రికవరీ అయ్యారు.
 2. శుక్రవారం బోగిపండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వయంగా పాాల్గోని, సంక్రాంతి పండుగ సాంప్రదాయ కళల ప్రదర్శనను ఆసక్తిగా తీలకించారు. హరిదాసుల వారికి బిక్షాన్ని స్వయంగా వేశారు. గంరగిరెద్దుల వారితో కొంత సేపు గడిపారు. పలు ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన కళాకారులతో ఫోటోలు దిగారు. సినీ గాయని మంగ్లీ చేత సంక్రాంతి పాటలు పాడారు. మంగ్లీ ఆమె సోదరిని జగన్ అభినందించారు.
 3. జనవరి14వతేదిన శుక్రవారం నాడు అక్కినెేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగారు రాజు మరియు అశిష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన, దిల్ రాజు నిర్మించిన రౌడీభాయ్స్ సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలో థియోటర్లలో విడుదల అయ్యాయి.
 4. సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం బోగి పండుగను తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకొన్నారు.
 5. ఏపిలో శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో 4528 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలో 1027, విశాఖ జిల్లాలో 992 కేసులు నమోదు కాగ, అత్యల్ఫంగా పశ్చిమగోదావరి జిల్లాలో62 కేసులు,విజయనగరం జిల్లాలో 121 కేసులు నమోదు అయ్యాయి.
 6. ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి
  పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఏమన్నరంటే….మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు’ అని సీఎం జగన్‌ తెలిపాారు.
 7. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి విడత పోలింగ్‌ కు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది. తొలివిడత పోలింగ్ ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. ఈ విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో ఉ‍న్న 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు.
 8. దేశ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని విజన్ ఇండియా -2047 నివేదికలను అన్ని శాఖలు రూపొందించాలని భారత ప్రధాని నరేంద్రమోది కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.
 9. వివిధ రంగాలలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోది 150 స్టార్టప్ కంపెనీ స్థాపకులతో జనవరి15 శనివారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం,ఎంటర్ ప్రైజస్ సిస్టమ్, అంతరిక్షం, పారిశ్రామిక రంగాలలో స్టార్టప్ లు రూపకల్పన చేసినవారితో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
 10. దేశంలో ప్రయాణ వాహనాల కొనుగోలు డిసెంబర్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్య భారిగా తగ్గినట్లు ఇండియన్ ఆటో మెుబైల్ మ్యానిప్యాక్చర్ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం భారత్ 13శాతం మేర కొనుగోలు తగ్గాయి. ద్విచక్ర వాహానాలు 11శాతం కొనుగోళ్లు తగ్గాయి.