మదనపల్లి టమోటా మార్కెట్ కు శనివారం సెలవు

0
149

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ గా పేరుగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ యార్డుకు సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని శనివారం శెలవు ప్రకటించినట్లు టమోటా మండి యజమానుల సంఘం అధ్యక్షుడు కటారి వెంకటరమణ @ K.V.R మనఛానల్.ఇన్ ప్రతినిధికి తెలిపారు. సెలవు కారణంగా మార్కెట్ లో ఏలాంటి వ్యాపార లావాదేవీలు జరగవని, ఇతర ప్రాంతాల వ్యాపారులు పండుగ కారణంగా మార్కెట్ కు రానందున సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కావున రైతులు ఏవరూ తమ పంటలను తీసుకురావద్దని కోరారు. ఆదివారం నుంచి టమోటా మార్కెట్ యధావిధిగా పనిచేస్తుందని తెలియచేశారు. ఈసందర్భంగా K.V.R రైతులకు, వ్యాపారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.