మదనపల్లిలో ముగ్గుల పోటీలు

0
520

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు. రామసముద్రం చెందిన మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మదనపల్లి పట్టణానికి చెందిన మహిళలే కాక సమీపంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఎంతో పాల్గోన్నారు. పలువురు మహిళలు ఎంతో ఆసక్తితో, ఉత్సహాంగా ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గోన్నారు. తమ లోని సృజనాత్మకతతో రంగవల్లులు వేశారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మహిళలు హజరు అయ్యారు. నిర్వహకులు పోటిలో పాల్గోన్న మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు, ఆకర్షణీయమైన ముగ్గులు వేసి పోటిలలో విజయం సాధించిన మహిళలకు మల్లెల ఫౌండేషన్ ప్రథమ, ద్వితీయ , తృతీయ బహుమతుల అందచేశారు. ముగ్గుల పోటీలను తీలకించేందుకు స్థానికులు అధికంగా హాజరయ్యారు.