Today Top News : ఈరోజు ప్రధానాంశాలు @ manachannel.in

0
128

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  • కర్నాటకలో గత 24 గంటలలో 21390 కరోనా కేసులు నమోదు కాగ, అందులో ఒక్క బెంగుళూరు నగరంలోనే 15617 ఉన్నాయి. రోజువారి పాజిటివ్ రేటు16శాతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులలో ఒక్క బెంగుళూర్ లోనే 73శాతం కేసులు నమోదు అయ్యాయి.
  • గత 24 గంటలలో దేశంలో 2.47,417 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క సారిగా 27శాతం పాజిటివ్ రేటు పెరిగింది. 380 మంది మరణించారు.
  • భారత ప్రధాని నరేంద్రమోది గురువారం సాయంకాలం 4.30గంటలకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా కరోనా 3వ వేవ్ ను ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆంశంపై చర్చించనున్నారు.
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలలో భక్తుల తాకిడి అధికమైంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు అధికంగా తిరుమల చేరుకొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరుమల చేరుకొని దైవ దర్శనం చేసుకొన్నారు.
  • ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కలవనున్నారు. తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై సి.ఎం.తో చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలపై చర్చించనున్నారు.
  • ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అయోధ్య నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన నామనేషన్ పత్రాలు దాఖలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారిగా పెరిగాయి. గత 24 గంటలలో 27561 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 40 మంది మరణించారు.కరోనా కేసులలో 65 శాతం మంది రోగులు హాంఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
  • ఎరువుల ధరలను తగ్గించాలని కకోరుతూ తెలంగాణ సి.ఎం. కె.సి.ఆర్. బుధవారం ప్రధాని నరేంద్ర మోదికి లేఖ రాశారు.