Covid-19 : 2.47లక్షల కేసులు – 380 మరణాలు – కరోనా కు స్వీయ రక్షణే శ్రీరామ రక్షణ

0
167

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
దేశంలో మూడవ వేవ్ వేగంగా పుంజుకొంటోంది. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి అధికమౌతోంది. దేశంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఏలాంటి లాక్ డౌన్ లు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. కేసుల సంఖ్య పెరిగే కొద్ది ఆసుపత్రులలో వసతులను పెంచే మార్గాలను చూస్తున్నట్లు కనిపిస్తోంది. మూడవ వేవ్ లో హోమ్ ఐసోలేషన్ కేసులే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రజలు కరోనా బారిన పడకుండ స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఉదయానికి దేశంలో 2,47,417 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 27శాతం కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 46723 కేసులు, ఢిల్లీలో 27651 కేసులు, కేరళలో 12,742 కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5488 గా నమోదు అయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 1367 కేసులు, రాజస్థాన్ లో 792 కేసులు, కేరళలో 486 కేసులు, కర్నాటకలో 79 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 294 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 95.59శాతంగా ఉంది. కోవిడ్ కారణంగా గత 24 గంటలలో దేశంలో 380 మంది మరణించారు.రోజు వారి పాజిటివ్ రేటు 13.11శాతంగా ఉంది. వీక్లి పాజిటివ్ రేటు 10.80శాతంగా ఉంది.గురువారం నాటికి దేశంలో 154.61 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి అయ్యాయి.