కరోనా మందు మన చేతిలోనే……స్వీయ రక్షణే శ్రీరామ రక్ష- ఇవి పాటించండి.

0
129

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

 • మాస్క్ ఖచ్చితంగా ధరించాలి.
 • శానిటైజర్ తరచూ వాడాలి.
 • అధిక జనం సముహాలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒక వేళ వెళ్లినా మాస్క్ ధరిస్తూ, తరచూ శానిటైజర్ వాడాలి.
 • ప్రయాణాలు తగ్గించుకోవాలి. విందులు, వినోదాలు, పెళ్లిళ్లు ఇతర ప్రొగ్రామ్ లకు మార్చి వరకు వెళ్లకపోవడమే ఉత్తమం. తప్పనిసరిగా వెళ్లినా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు అనుసరించాలి.
 • మంచి ఆహారం తినాలి.
 • రోజు గోరు వెచ్చని తాగునీరు ఉదయం, సాయంకాలం తాగాలి.
 • తాజా కూరగాయలు, ఆకుకూరలు వండి తినాలి.
 • సీజనల్ ప్రూట్స్ తినాలి.
 • కోడి గుడ్లు, చాపలు తగినంతగా తింటూ..మాంసాహారాన్ని తగిన మోతాదులో తీసుకోవాలి.
 • ఉదయం లేదా సాయంకాలం కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్, కనీసం 10 నిమిషాలు వ్యాయామం చేయాలి.
 • అజీర్ణమయ్యే ఆహారం తినరాదు.
 • జలుబు, దగ్గు, ఆయాసం, సత్తువ లాంటివి వస్తే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను కలిసి చికిత్స చేయించుకోండి.
 • రోజు కనీసం 3 నుంచి 4లీటర్ల మంచి నీరు తాగండి.
 • కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోక ఉంటే తక్షణమే వేసుకోండి. అపోహాలు వీడండి.
 • ఇంట్లో 60 సంవత్సరాల పైబడినవారు ఉంటే వెంటనే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయించండి.
 • చిన్న పిల్లలను అనవసరంగా బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ కు, హోటల్స్ కి తీసుకెళ్లకండి.