ఏపిలో 4348 కొత్త పాజిటివ్ కేసులు -47884 శాంపిల్ పరీక్షలు

0
272

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటలలో 47884 శాంపిల్ పరీక్షలు నిర్వహించగ గురువారం ఉదయానికి 4348 కేసులు నమోదు అయ్యాయి. ఇరువురు మరణించారు. చిత్తూరు జిల్లాలో 932 కేసులు, విశాఖపట్టణంలో 823కేసులు, నెల్లూరు జిల్లాలో 395 కేసులు, గుంటూరు జిల్లాలో 338కేసులు,కృష్ణ జిల్లాలో 296 కేసులు, విజయనగరం జిల్లాలో 290 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 259 కేసులు,తూర్పుగోదావరి జిల్లాలో 247 కేసులు, అనంతపురం జిల్లాలో 230 కేసులు, కడప జిల్లాలో 174 కేసులు, కర్నూలు జిల్లాలో171 కేసులు, ప్రకాశం జిల్లాలో 107 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 86 కేసులు నమోదు అయ్యాయి. ఏపిలో అన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే 15 రోజులలో కేసులు తారా స్థాయికి చేరి అనంతరం తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి ప్రభుత్వం ఏలాంటి లాక్ డౌన్ లు విధించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా తమ ఆరోగ్యం తమ చేతులలోనే ఉందనే విషయాన్ని గుర్తించుకొని స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనా మందు మన చేతిలోనే……స్వీయ రక్షణే శ్రీరామ రక్ష

 1. మాస్క్ ఖచ్చితంగా ధరించాలి.
 2. శానిటైజర్ తరచూ వాడాలి.
 3. అధిక జనం సముహాలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒక వేళ వెళ్లినా మాస్క్ ధరిస్తూ, తరచూ శానిటైజర్ వాడాలి.
 4. ప్రయాణాలు తగ్గించుకోవాలి. విందులు, వినోదాలు, పెళ్లిళ్లు ఇతర ప్రొగ్రామ్ లకు మార్చి వరకు వెళ్లకపోవడమే ఉత్తమం. తప్పనిసరిగా వెళ్లినా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు అనుసరించాలి.
 5. మంచి ఆహారం తినాలి.
 6. రోజు గోరు వెచ్చని తాగునీరు ఉదయం, సాయంకాలం తాగాలి.
 7. తాజా కూరగాయలు, ఆకుకూరలు వండి తినాలి.
 8. సీజనల్ ప్రూట్స్ తినాలి.
 9. కోడి గుడ్లు, చాపలు తగినంతగా తింటూ..మాంసాహారాన్ని తగిన మోతాదులో తీసుకోవాలి.
 10. ఉదయం లేదా సాయంకాలం కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్, కనీసం 10 నిమిషాలు వ్యాయామం చేయాలి.
 11. అజీర్ణ అయ్యే ఆహారం తినరాదు.
 12. జలుబు, దగ్గు, ఆయాసం, సత్తువ లాంటివి వస్తే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను కలిసి చికిత్స చేయించుకోండి.
 13. రోజు కనీసం 3 నుంచి 4లీటర్ల మంచి నీరు తాగండి.
 14. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోక ఉంటే తక్షణమే వేసుకోండి. అపోహాలు వీడండి.
 15. ఇంట్లో 60 సంవత్సరాల పైబడినవారు ఉంటే వెంటనే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయించండి.
 16. చిన్న పిల్లలను అనవసరంగా బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ కు, హోటల్స్ కి తీసుకెళ్లకండి.