Madanapalle Tamotto: మదనపల్లి టమోట మార్కెట్ – దిగుబడి లేదు- ధర లేదు – దిగుమతే ఆధారం

0
823

మనఛానల్ న్యూస్ – మదనపల్లి

ఆసియాలోనే అతిపెద్ద టమోట మార్కెట్ గా పేరుగాంచిన మదనపల్లిలో సమీప పరిసర ప్రాంతాలలో టమోటా దిగుబడి భారిగా తగ్గడంతో స్థానిక టమోట మార్కెట్ వెలవెలబోతోంది. దీంతో వ్యాపారులు సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్ కు
టమోటా తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకొనే పరిస్థితి నెలకొంది. గత కొంత కాలంగా భారీ వర్షాలు రావడంతో టమెటా పంట పండకపోవడం, ధరలు నిరంతరం అస్థిరంగా ఉండడం, కరోనా పరిస్థితులలో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండడం మూలంగా టమోటా సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 58వేల హెక్టార్లలో టమోటా సాగుచేస్తుండగ, 26.67లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అవుతోంది. ఆసియాలో అతి పెద్ద మార్కెట్ గా పేరొందిన మదనపల్లి కి రోజు 800టన్నుల టమోటాలు వచ్చేవి అయితే గత నెల రోజులుగా 20 నుంచి 100 టన్నుల లోపే టమోటోలే మార్కెట్ కు వస్తున్నాయి. స్థానిక రైతాంగం టమెటా సాగుపై పెద్దగా ఆసక్తి చూపకపోవండం వల్ల మదనపల్లి మార్కెట్ కు టమోటాలు రావడం తగ్గింది.

ఈ పరిస్థితులలో టమోటా కమీషన్ మండీ వ్యాపారులు చత్తీస్ఘడ్, ఒరిస్సా నుంచి రోజుకి పదుల సంఖ్యలో లారీల ద్వారా టమోటాలను దిగుమతి చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. అయితే అనుహ్యాంగా దిగుమతి చేసుకొంటున్న టమోటాలు సైతం పెద్దగా ధరలకూడ పలకడం లేదు. ప్రస్తుతం మదనపల్లిలో కిలో
టమోట ధర రూ.10 నుంచి 20లోపే పలుకుతుండడంతో పెద్దగా గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. స్థానికంగా దిగుబడి పెద్దగా లేకపోవడంతో అధికంగా దిగుమతిపైనే మదనపల్లి మదనపల్లి టమోట మార్కెట్ ఆదారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.