Telugu Cinima : ఏపిలో సినిమా టికెట్ల వివాదం ముగుస్తుందా…?? మంత్రి పేర్ని నాని, దర్శకుడు వర్మ మధ్య నేడు కీలక భేటి

0
473

మనఛానల్ న్యూస్ – సినిమాడెస్క్
తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ రేటు పెంచాలనే డిమాండ్ ను ఏపి ప్రభుత్వం ససేమిరా అంటున్న తరుణంలో ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ విన్నపం మేరకు ఏపి సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆయనకు సోమవారం మద్యాహ్నం అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇందుకోసం వర్మ విజయవాడకు చేరుకొన్నారు. మంత్రి నాని మరియు డైరక్టర్ వర్మ మధ్య తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై చర్చించనున్నారు. అధిక బడ్జెట్ తో తీసే సినిమాలకు విడుదల అయిన 10రోజులు పాటు ధరలు పెంచాలనే డిమాండ్ తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల నుంచి వస్తోంది.

పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్నింటికి ఒకే ధర ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల పెద్ద నిర్మాతలు ఇబ్బందులు పడుతారని సినిమా పెద్దలు అంటుండగ, అధిక టికెట్ ధరల వల్ల సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుందని దీనిని తాము అనుమతి ఇవ్వమని ఏపి ప్రభుత్వం అంటోంది. పెద్ద సినిమాల విడుదల వేళ థియోటర్ల వద్ద బ్లాకులో టికెట్లు ధర వేలల్లో అమ్ముతున్నారు. దీనివల్ల సినిమా చూడాలనే ఉత్సహాంలో సామాన్యుడు నష్టపోతున్నారు. దీనికి తోడు టికెట్లు వేలల్లో అమ్ముతూ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గోడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీనికి మధ్యమార్గంగా సమస్యపై
ప్రభుత్వం-పరిశ్రమ వర్గాలు కులాంకుశంగా చర్చించి, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు.

మంత్రి పేర్ని నాని-డైరక్టర్ వర్మ మధ్య చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వర్మ డిమాండ్ – సప్లేయ్ సూత్రం ప్రకారం సినిమా నిర్మాతలే సినిమా టికెట్ ధరలు నిర్ణయించుకోవాలని..మధ్యలో ప్రభుత్వ జ్యోక్యమెందుకని లాజిక్ మాట్లాడుతున్నారు. అడ్డుగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదని మంత్రి పేర్ని నాని అంటున్నారు. ఈ వివాదం సమిసిపోవడానికి పరస్పరం 10 నిమిషాలు పరస్పరం చర్చించుకొంటే పరిష్కారం అవుతుందని దర్శకుడు వర్మ తెలిపారు. దర్శకుడు వర్మ తన లాజిక్ తో మంత్రి పేర్నినాని ఒప్పించి ప్రభుత్వం నుంచి పాజిటివ్ ఫలితాలు తెస్తారా..లేక సమస్య పరిష్కారానికి మళ్లీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.