RGV Meet Minister NANI: మంత్రి పేర్నినాని – డైరక్టర్ వర్మ భేటి పూర్తి – సినిమా చర్చలు ఏమి జరిగాయి…!!

0
246

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపి సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలిసి సోమవారం చర్చించారు. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్న రాంగోపాల్ వర్మను తనకు అవకాశం ఇస్తే మంత్రి పేర్ని నానితో కలిసి చర్చించి తన అభిప్రాయాలను చెప్పుతానని అన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు సోమవారం అమరావతికి డైరక్టర్ వర్మను
మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. పరస్పరం చర్చించారు. తన అభిప్రాయాలను వర్మ మంత్రికి వివరించారు. తాను చెప్పదల్చుకొన్న విషయాలను నేరుగా వివరించారు. పలు సూచనలు చేశారు. టికెట్ల వ్యవహారంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. మంత్రి వర్మ చెప్పిన అన్ని విషయాలను ఓపికగా విన్నారు. ఆయన చెప్పిన సలహాలను కమిటి ముందు ఉంచుతానని భేటి అనంతరం మీడియాతో అన్నారు.

NANI WITH VARMA

సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సినీ వర్గాల వారు నేరుగా వచ్చి ప్రభుత్వానికి చెప్పవచ్చునని, వినడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. తాము సినిమా పరిశ్రమలోని అందరిని సమానంగా చూస్తామన్నారు. ఏవరిపైన ప్రభుత్వానికి ద్వేషం లేదని మంత్రి వెల్లడించారు. పరిశ్రమను అభివృద్ధి పర్చాలన్నదే తమ అభిమతమన్నారు. సినిమా టికెట్ల ధరల విషయంలోతాము 2013లో ప్రభుత్వం జారీ చేసిన జి.వో నెం.100 కు అనుగుణంగానే నిర్ణయం తీసుకొంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి పేర్నినానితో తమ భేటి ఎంతో సంతృప్తికరంగా సాగిందని డైరక్టర్ రాంగోపాల్ వర్మ విడిగా విలేఖర్లకు లిపారు. తన అభిప్రాయాలను మంత్రికి వివరించానని అన్నారు. అమరావతి తాను సినీ పెద్దల కామెంట్స్‌, లేఖలపై స్పందించేందుకు రాలేదని వర్మ వివరించారు.తాను చెప్పదల్చుకొన్నదని చెప్పానని ఇక దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకొంటుందని వర్మ వ్యాఖ్యనించారు.

VARM SPEAKS MEDIA