Covid-19 Latest News: దేశంలో1.79 లక్షల కరోనా కేసులు -146 మరణాలు

0
173

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
దేశంలో కరోనా కేసులు అప్రతిహతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజులలో మరిన్నీ కేసులు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రాణపాయం మాత్రం స్వల్ఫంగా కనిపిస్తున్నట్లు గణాంకాలు చెప్పుతున్నాయి. సోమవారం ఉదయానికి దేశ వ్యాప్తంగా 1,79,723 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటలలో కేవలం 146 మంది మాత్రమే మరణించారు. నిన్నటి కంటే నేడు 12.6శాతం కేసులు అధికంగా పెరిగాయి. అలాగే రోజు వారి పాజిటివ్ రేటు 13.29శాతానికి పెరిగింది. రికవరీ రేటు 96.26శాతంగా ఉంది. సోమవారం నుంచి ప్రీకాషన్ డోస్ పేరిట మూడవ డోస్ ను బూస్టర్ గా అందించడం దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. ముందుగా ప్రంట్ లైన్ వర్కర్స్, 60సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ అందిస్తారు. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 4033గాను, వ్యాక్సినేషన్ల సంఖ్య 152 కోట్లకు చేరింది.

Image