తెలంగాణలోనే నాబతుకు – ఏపిలో పార్టీ పై స్పష్టత ఇచ్చిన వై.ఎస్ షర్మీల

0
701

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
ఏపిలో కూడ వై.ఎస్.షర్మిల తన పార్టీని విస్తరిస్తున్నారంటూ…
షర్మిల తన బాణం అన్న జగన్ పైనే వదులుతున్నారంటూ అడ్డుగోలు వార్తలు వండుతూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్న టిడిపి అనుకూల మీడియా సంస్థలకు తెలంగాణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల శుక్రవారం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను తెలంగాణలోనే పుట్టానని, పెళ్లి చేసుకొన్నానని, కుమార్తెకు, కుమారుడికి జన్మనిచ్చానని తన బతుకు తెలంగాణాలోనేనని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అడుగుజాడలలో నడుస్తున్నానని తెలిపారు. ఆమె దీని ద్వారా తాను తన పార్టీ కేవలం తెలంగాణలోనేనని స్పష్టం చేశారు. తెలంగాణ సి.ఎం.కె.సి.ఆర్ తనకు అధికారం శ్వాశతంగా భావిస్తున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నరు. రాజకీయలలో అప్ అండ్ డౌన్స్ మాములేనని అన్నారు. ఇప్పుడు ఓడినవారు మళ్లీ గెలుస్తారన్నారు.