ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు 23శాతం పిట్ మెంట్ ప్రకటన – రిటైర్మెంట్ 60నుంచి 62సంవత్సరాలకు పెంపు

0
460


మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు సి.ఎం.వై.ఎస్.జగన్ వరాలు ప్రకటించారు.

 • పెంచిన జీతాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందిస్తారు.
 • పిట్ మెంట్ 23శాతం పెంచారు.
 • 5 పెండింగ్ డి.ఎలు ఒకే మారు జనవరి 2022 జీతంతో కలిపి చెల్లిస్తారు.
 • ఇళ్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్నటౌన్ షిప్ లో 10శాతం రిజర్వేషన్,20శాతం రిబేట్
 • ఉద్యోగ విరమణ 60 నుంచి 62వరకు పెంపు
 • హెచ్.ఆర్.ఏ పై త్వరలో నిర్ణయం
 • సి.పి.ఎస్ రద్దుపై జూన్ 31లోపు నిర్ణయం
 • ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ.10కోట్ల అధనపు భారం
 • గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ నుంచి రెగ్యులర్

జనవరి2022 జీతంతో కలిపి పెండింగ్ 5డిఎలు చెల్లిస్తారు.ఉద్యోగులకు జీతాలు, డి.ఎలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణం రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.

ప్రభుత్వం నడవాలంటే మీ అందరి సహకారం కావాలి …ఓమిక్రాన్ కరోనా సమస్యలు ఏవిధంగా ఉంటాయో చెప్పలేం..ఉద్యోగులు సహకరించాలి.- ys jagan

జూన్ 30వతేది లోపు కారుణ్య నియామకాలు తప్పనిసరిగా చేయాలని చీఫ్ సెక్రటరి సమీర్ కు జగన్ మీడియా ముందే ఆదేశాలు జారీ చేశారు.

స్వంత ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న టౌన్ షిప్ లలో 10శాతం రిజర్వు చేస్తారు. ధరలలో 20శాతం రిబేట్ ఇవ్వనున్నారు.- YS Jagan

 • కాంట్రాక్టు ఉద్యోగులుకు జనవరి2021 నుంచి పెంచిన జీతాలు అందిస్తారు.
ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్న సి.ఎం.వై.ఎస్.జగన్ live
 • ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు.
 • ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు.
 • పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్‌ ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు.
 • తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.