మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హైదరబాద్ లో మంగళవారం నిర్వహించదల్చిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతగా మారింది. ఢిల్లీ నుంచి హైదరబాద్ కు వచ్చిన జె.పి.నడ్డాకు విమానాశ్రయంలో తెలంగాణ పోలీసులు కలిసి కరోనా ఆంక్షల నేపథ్యంలో నిరసన ర్యాలీకి అనుమతి లేదని నగర జాయింట్ పోలీసు కమీషనర్ కార్తికేయ వివరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జి.వో కాపిని బిజెపిజాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు అందచేశారు. అయితే నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని, తాము నిరసన ర్యాలీ నిర్వహించి తీరుతామని ఎయిర్ పోర్టు నుంచి బిజెపి శ్రేణులతో సికింద్రాబాద్ ఎం.జి.రోడ్డుకు భయలుదేరారు.
40 మందితో నిరసన ర్యాలీకి తెలంగాణ ప్రభుత్వం జె.పినడ్డాకు అనుమతి ఇచ్చింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎయిర్ పోర్టు నుంచి భయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కోవిడ్ నిబంధనలను అనుసరించి నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు.జి.వొ.నెం.315 కు నిరసనగా తెలంగాణ బి.జె.పి చీఫ్ బండి సంజయ్ ను కరీంనగర్ లో నిరసన చేపట్టగా తెలంగాణ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనను రిమాండ్ కు ఆదేశించడంతో ఆయన జైలులో ఉన్నారు. దీనికి నిరసనగా బిజెపి నాయకత్వం హైదరబాద్ లో చేపట్టిన ఎం.జి.రోడ్డు నుంచి ర్యాలీ చేపట్టారు.