RRR Cinima : ఆర్.ఆర్.ఆర్ సక్సస్ కు రిలీజ్ కు ముందే భారీ ప్రణాళికలు – ఈ మూడు వారాలు దూకుడే

0
202

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
టాలీవుడ్ టాప్ స్టార్స్ జూనియర్ ఎన్.టి.ఆర్.,రామచరణ్ లతో సక్సస్ పుల్ డైరక్టర్ రాజమౌళీ మది నుంచి రాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. (RRR) నూతన సంవత్సరంలో జనవరి7వ తేదీన విడుదలకు సిద్ధమౌతోంది. ఇందుకు భారీగా ప్రీ రిలేజ్ పంక్షన్లు, భారీ పబ్లిసిటి, దేశమంతా ప్రచార యాత్రలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ పంక్షన్ ను ముంబాయిలో ఏర్పాటుచేస్తున్నారు. రాబోయే మూడు వారాలు ఆర్.ఆర్.ఆర్ టీమ్ దేశమంతా సుడిగాలి పర్యటన చేసి సినిమాను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

RRRరౌద్రం రణం రుధిరం సినిమా యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం. బహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కోవిడ్ అనంతరం థియోటర్లకు రాబోతున్న అతిపెద్ద భారి బడ్జెట్ చిత్రం ఇదే కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇరువురు హీరోలకు తగిన రీతిలో ఈ సినిమా ను ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, ఓలివియా మోరీస్, శ్రియా శరణ్, సముద్రఖని, కీలక పాత్రల్లను పోషించారు.

RRRరౌద్రం రణం రుధిరం బృందం..ఈ మూడు వారాలు మరోస్థాయిలో చిత్ర ప్రమోషన్స్ ఉండబోతున్నాయని, ఇందులో భాగంగా టూర్స్, ఈవెంట్స్‌తో పాటు మరెన్నో సర్‌ప్రైజెస్ ఉండబోతున్నాయని..వీటి కోసం సిద్దంగా ఉండమని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఉత్సహాన్ని నింపుతున్నాారు. ముంబైలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరవనున్నారు.

రాజమౌళి లాంటి దర్శక దిగ్గజం సినిమా రిలీజ్ అంటే సినిమా ప్రపంచానికే పెద్ద పండుగ అని చెప్పాలి. కరోనా కారణంగా లాక్ డౌన్ల తో బోసిపోయిన థియోటర్లకు ఇప్పుటికే అఖండ, పుష్ప లాంటి సినిమాలు దాదాపు కలెక్షన్లతో దుమ్ము దులుపేశాయి. RRRరౌద్రం రణం రుధిరం సినిమా హిట్ ఇస్తే సినిమా ప్రపంచానికి మళ్లీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. కొత్త సంవత్సరంలో సినిమా ప్రేక్షకులకు ఆర్.ఆర్.ఆర్. మంచి వినోదం..పరిశ్రమను కాపుడుతుందని ఆశిద్దాం. సినిమా ఆనందంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రేక్షకానందం క్షణికమే అవుతుంది. కాబట్టి ఎంత ఉత్సహం ఉన్న థియోటర్ల ముందు..లోపల..ఖచ్చితంగా మాస్క్ దరించండి..శానిటైజర్ వాడండి..సామాజిక దూరం పాటిచండి…సినిమా చూస్తూ ఆనందమే కాదు..మీ ఆరోగ్యాలు కూడ కాపుడుకోండి..

Latest posters from 'RRR' Movie starring Jr.NTR and Ramcharan directed by  SS Rajamouli. - Chennaivision